logo
తెలంగాణ

MLC Elections 2021: ఉత్కంఠగా మారిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

Graduate MLC Election Votes Counting in Telangana
X

ఫైల్ ఇమేజ్ 

Highlights

MLC Elections 2021: మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోని మొదటి ప్రాధాన్యత ఓట్లు * కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

MLC Elections 2021: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. రెండో ప్రాదాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 66 మంది అభ్యర్ధులు ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎల్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఒక లక్షా 17 వేల 386 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 91 వేల 858 ఓట్లు రాగా తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరామ్‌కు 79 వేల 110 ఓట్లు వచ్చా యి. తీన్మార్‌ మల్లన్నపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి 25 వేల 528 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రెండో ప్రాధాన్యత, ఎలిమినేషన్ ప్రక్రియలో స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు ఓట్లు పెరుగుతున్నాయి. దుర్గాప్రసాద్, చెరుకు సుదాకర్, జయసాఱది రెడ్డిల ఎలిమినేషన్ ప్రక్రియలో తీన్మార్ మల్లన్నకు ఓట్లు వచ్చాయి. ఓవర్ ఆల్ గా మొదటి స్తానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరం ఉంది.

Web TitleMLC Elections 2021: Graduate MLC Election Votes Counting in Telangana
Next Story