Hyderabad: తెలంగాణలో ముదురుతోన్న ఎండలు

Hyderabad: ‌‌వాతావరణం: తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి.

Kranthi
Updated on: 26 Feb 2021 10:58 AM IST
Gradually rising suns in Telangana
X

ఇమేజ్ ఫైల్


వాతావరణం: తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీ‌లకు చేరాయి. గురు‌వారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కారంలో 38.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. పెద్దపల్లి, నల్లగొండ, కరీంనగర్‌, ఖమ్మం, మహ‌బూ‌బా‌బాద్‌ జిల్లా‌ల్లోని 10 ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమో‌దై‌నట్టు టీ‌ఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్ తెలిపింది. రాష్ట్రంలో సగ‌టున 36.1 నుంచి 38.1 డిగ్రీల మధ్య నమో‌దై‌నట్టు పేర్కొంది. కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు), జీహె‌చ్‌‌ఎంసీ పరి‌ధి‌లోని బీహె‌చ్‌‌ఈ‌ఎ‌ల్‌లో 12.4 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణో‌గ్రత రికార్డయింది. తూర్పు, ఈశాన్యగాలుల ప్రభావంతో రాగల మూడ్రో‌జులు రాష్ట్రంలో పొడి వాతా‌వ‌రణం ఉంటుం‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

Kranthi

Kranthi

Next Story