ఆర్టీసీ సమస్యకు సర్కార్ యాక్షన్ ప్లాన్.. వారందరినీ ఇంటికే?

ఆర్టీసీ సమస్యకు సర్కార్ యాక్షన్ ప్లాన్.. వారందరినీ ఇంటికే?
x
కేసీఆర్
Highlights

ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించిన ఆర్టీసీ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గురువారం జరిగే కేబినెట్ భేటీలో సమస్యకు...

ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించిన ఆర్టీసీ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గురువారం జరిగే కేబినెట్ భేటీలో సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సర్కార్ అడుగులు వేయబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది.

ఆర్టీసీ సమస్య ముగింపు పై కేసీఆర్ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. పూర్తిస్థాయిలో ఆర్టీసి ప్రక్షాళన దిశగా పావులు కదుపుతోంది. 5 వేల కోట్ల అప్పుల్లో ఉన్నఆర్టీసీని ఇప్పుడున్న పరిస్థితిలో నడపడం సాధ్యం కాదని భావించిన సర్కార్ 50 శాతం ఆర్టీసి యాజమాన్యం మరో 50 శాతం ప్రైవేటు వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 5 వేల ఒక వంద రూట్లలో రోడ్లను ప్రైవేటు వారికి అప్పగించింది.

ఆర్టీసీ సమస్యకు ముగింపు పలుకుతామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు కు ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమవుతోంది. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై చర్చించారు. గురువారం కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవడం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అప్పులు, విభజన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఇక ఆర్టీసీలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. ఆర్టీసీ కి సంబంధించిన మూడు కీలక అంశాల పై క్యాబినెట్ దృష్టిసారించే అవకాశాలున్నాయి. అందులో ఒకటి ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, రెండవది ఆర్టీసీ ఉద్యోగులకు వి ఆర్ ఎస్, ఇక మూడోది ఆర్టీసీ ఆస్తుల వేలం. ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు స్టేజ్ కారియర్ లుగా అనుమతివ్వాలని గత సమావేశంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు కూడా మంత్రివర్గ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూట్ల ప్రైవేటీకరణ విధివిధానాలు ఖరారు మాత్రమే మిగిలింది.

దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలపై రవాణా శాఖ ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను క్యాబినెట్ ముందుంచనున్నారు. రాష్ట్రంలో 3 వేల 600 రూట్లు జాతీయం చేయబడ్డాయి. ఈ రూట్లలో ఆర్టీసీ బస్సులు మినహా ప్రైవేటు బస్సులు తిరగడానికి వీల్లేదు. ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతి ఇవ్వాలంటే ఈ విధానానికి స్వస్తి పలకాలి. దీనిపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఆర్టీసీ లో ఉద్యోగుల సంఖ్యను కుదించాలనే వ్యూహంలో ప్రభుత్వం ఉంది. దీనికోసం వి ఆర్ఎస్ లేదంటే సి ఆర్ ఎస్ పథకాన్ని అధ్యయనం చేస్తోంది. వి ఆర్ ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ అదే సిఆర్ఎస్ అంటే తప్పనిసరి పదవీ విరమణ 50 ఏళ్లు పైబడిన ఆర్టీసీ ఉద్యోగులు అందరిని ఈ రెండింటిలో ఏదో ఒక పథకం కింద ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. స్వచ్ఛంద పదవీ విరమణ అయితే ఆర్థిక భారం ఎక్కువ పడుతుందనే అంచనా లో ఉన్నారు. అదే తప్పనిసరి పదవీ విరమణ పథకం అయితే ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక పథకాన్ని ప్రభుత్వం అమలు చేసే అవకాశముంది.

స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కోసం ఆర్టీసీలో 50 ఏళ్ల పైబడిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 వేల మంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దేశంలో అమలైన అమలవుతున్న ముందస్తు పదవీ విరమణ పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ రవాణా అధికారులను ఆదేశించారు. ఏ స్కీం ప్రకటిస్తే తక్కువ భారం పడుతుందో దాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలిసింది. సిఆర్ఎస్ పోగా మిగిలిన వారిని మాత్రమే షరతులతో హామీ పత్రం పై సంతకం చేయించుకొన్న తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అది కూడా మరికొంత కాలం తర్వాతే ఈ నిర్ణయం ప్రకటించనున్నారని సమాచారం.

ఆర్టీసీ అప్పులను ఏ విధంగా చెల్లించాలనే దానిపై కూడా రోడ్ మ్యాప్ సిద్ధం చేసే అవకాశముంది. అందుకే తెలంగాణలోని ఆర్టీసీ సంస్థ ఆస్తులన్నీ లెక్కేస్తున్నారు. అందులో ఆర్టీసీ సొంత ఆస్తులు ఎన్ని ప్రభుత్వం ఇచ్చిన ఆస్తుల వివరాలు ఎన్ని అన్న లెక్కలు తీయిస్తున్నారు. ఈ వివరాలు అందగానే ఆస్తుల అమ్మకం పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ విభజన జరగక పోవడం వల్ల ఆస్తులు అమ్మడానికి వీలులేదు. అందుకే ఈ ఆస్తుల్లో ఆర్టీసీ ఆధీనంలోని రాష్ట్ర ప్రభుత్వ భూములు ఉంటే వాటిని వేలం వేసి అప్పులు కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories