గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

* తమిళిసై తల్లి కృష్ణకుమారి మృతి * కృష్ణకుమారి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం * రేపు చెన్నైలో కృష్ణకుమారి అంత్యక్రియలు

Sandeep Reddy
Published on: 18 Aug 2021 9:14 AM IST
Governor Tamilsai Soundarajan Mother Krishna Kumari is No More
X

తమిళిసై ఆమె తల్లి కృష్ణకుమారి(ట్విట్టర్ ఫోటో)

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం కలిగింది. తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. 80 ఏళ్ల వయసున్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య, గవర్నర్ తమిళిసై ఆమె పెద్ద కూతురు గవర్నర్ తల్లి మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రేపు చెన్నైలో కృష్ణకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story