TSRTC Bill: ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం

Governor Tamilisai Soundararajan  Approve Telangana Rtc Bill
x

TSRTC Bill: ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం

Highlights

TSRTC Bill: ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

TSRTC Bill: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు బిల్లును నిశితంగా పరిశీలించి, న్యాయ సలహా తీసుకున్న తర్వాత సంతకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. న్యాయ సలహా కోరడంలో బిల్లుకు ఆమోదం తెలపడం కాస్త ఆలస్యమైందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories