Top
logo

ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తమిళిసై

ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తమిళిసై
X
Highlights

తెలంగాణ శాసనమండలిలో నామినేటెడ్ ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు...

తెలంగాణ శాసనమండలిలో నామినేటెడ్ ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ ప్రభుత్వం గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ పేర్లను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ ముగ్గురు మండలికి నామినేట్ అయ్యారు. ఇది వరకు గవర్నర్‌ కోటా కింద ఎంపికైన రాములు నాయక్‌, కర్నె ప్రభాకర్‌, దివంగత నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం పూర్తవడంతో ఆ స్థానాలను భర్తీ చేస్తూ ప్రభుత్వం వీరిని మండలికి నామినేట్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Web Titlegovernor TamilIsai release gazette notification for MLC posts
Next Story