Govenor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ..

Govenor Tamilisai: మూడేళ్లుగా యూనివర్సిటీలలో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 7 Nov 2022 5:27 PM IST
Governor Tamilisai Letter to Telangana Government
X

Govenor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ..

Govenor Tamilisai: మూడేళ్లుగా యూనివర్సిటీలలో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ చేయడం.. చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయం కోరారు గవర్నర్. ఎనిమిదేళ్లుగా అధ్యాపక ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని.. ప్రస్తుతం ఉన్న విధానంలో త్వరగా, పారదర్శకంగా రిక్రూట్‌మెంట్ చేయడంలో ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. ఖాళీల భర్తీ మరింత ఆలస్యమైతే ఉద్యోగార్థులకు ఇబ్బంది కదా అంటూ గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story