Tamilisai Soundararajan: ఫొటో ఎగ్జిబిషన్‌లో నిజాం పాలనలో తెలంగాణ ప్రజల బాధలు కనిపిస్తున్నాయి

Tamilisai Soundararajan: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 7:42 PM IST
Governor Tamilisai Inaugurates Photo Exhibition On Freedom Fighters Of Hyderabad
X

Tamilisai Soundararajan: ఫొటో ఎగ్జిబిషన్‌లో నిజాం పాలనలో తెలంగాణ ప్రజల బాధలు కనిపిస్తున్నాయి

Tamilisai Soundararajan: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్‌ ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా పరకాలలో 35 మందిని క్యూలో నిలబెట్టి నిజాం రాజులు ఒకేసారి తుపాకీతో కాల్చి చంపిన ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజలు పడిన బాధలు, స్వాతంత్ర్య సమరయోధుల కృషి కనిపిస్తోందని అన్నారు గవర్నర్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story