Tamilisai Soundararajan: ప్రజాదర్బార్‌లో కేక్ కట్ చేసిన గవర్నర్ తమిళి సై

Tamilisai Soundararajan: నూతన సంవత్సర ప్రసంగoలో కేంద్ర కృషిని ప్రశంసించిన గవర్నర్

Jyothi
Updated on: 1 Jan 2023 2:52 PM IST
Governor Tamilisai cut the Cake in Prajadarbar
X

Tamilisai Soundararajan: ప్రజాదర్బార్‌లో కేక్ కట్ చేసిన గవర్నర్ తమిళి సై


Tamilisai Soundararajan: నూతన సంవత్సర ప్రసంగంలో కేంద్ర కృషిని గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తమిళి సై ప్రస్తావించలేదు. రాజ్ భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాదర్బార్‌లో గవర్నర్ తమిళి సై కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు సకల సౌకర్యాలు కలిసి రావాలని గవర్నర్ అభిలషించారు.

గతేడాది కరోనా అనేక రకాల చేదు అనుభవాలు మిగిల్చిందన్నారు గవర్నర్ తమిళి సై... మన దేశం ఉపాధి రంగం, ఆర్థిక రంగంలో ముందుందని అన్నారు. కరోనాతో చైనా సేఫ్ లేదు. కానీ మనం సేఫ్‌గా ఉన్నామన్నారు. 81 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోందని తెలిపారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వ చొరవను ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని కొనియాడారు. కేంద్రం తీసుకున్న అనేక రకాల చర్యల వల్లే కరోనా పూర్తిగా కంట్రోల్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు.

Jyothi

Jyothi

Next Story