బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్న గవర్నర్ తమిళి సై

Governor Tamilisai: ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో కలసి మెస్‌లో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు

Sriveni Erugu
Published on: 7 Aug 2022 8:25 AM IST
Governor Tamili Sai Reached Basara Triple IT
X

బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్న గవర్నర్ తమిళి సై

Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటికి గవర్నర్ తమిళి సై చేరుకున్నారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు రైలులో ప్రయాణించిన గవర్నర్ నిజామాబాద్ నుండి రోడ్డు మార్గంలో ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. గవర్నర్‌కు ఇంచార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ స్వాగతం పలికారు. ఇక ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో కలసి మెస్‌లో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్​సతీష్​కుమార్‌తో పాటు ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్​టీచింగ్​ సిబ్బందితో కూడా స్పెషల్​మీటింగ్​నిర్వహిస్తారు. తర్వాత బాసర నుంచి బయలుదేరి నిజామాబాద్​జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడి స్టూడెంట్స్‌తో గవర్నర్ సమావేశం కానున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story