Tamilisai: TSPSC పేపర్‌ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

Tamilisai: 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, TSPSCకి ఆదేశం

Dhatripriya
Published on: 24 March 2023 7:15 AM IST
Governor Orders To Report On TSPSC Paper Leak
X

Tamilisai: TSPSC పేపర్‌ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

Tamilisai: TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై 48 గంటల్లో తాజా నివేదికలు సమర్పించాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్‌, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, డీజీపీకి రాజ్‌భవన్‌ కార్యాలయం లేఖలు పంపించింది. సిట్ దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో కూడా.. తెలపాలని లేఖల్లో గవర్నర్ స్పష్టం చేశారు. TSPSCలో పని చేస్తున్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఎంత మంది పరీక్షలు రాశారో కూడా నివేదిక ఇవ్వాలని గవర్నర్ పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సెలవులు పెట్టారా..? పరీక్షల్లో వారి ఫలితాలు ఎలా వచ్చాయో తదితర విషయాలను నివేదికలో వివరించాలని తమిళిసై స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story