Jishnu Dev Varma: రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది

Jishnu Dev Varma: భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'ను ప్రారంభించడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 8 Dec 2025 3:15 PM IST
Jishnu Dev Varma: రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది
X

Jishnu Dev Varma: భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'ను ప్రారంభించడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తోంది అని గవర్నర్ అన్నారు. 2047 నాటికి భారతదేశం నిర్దేశించిన 'వికసిత్ భారత్' లక్ష్యంలో భాగంగా, తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా ప్రయాణిస్తోందని గవర్నర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు వెళ్తోంది, అని ఆయన పేర్కొన్నారు.

ఈ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, 'రైజింగ్ తెలంగాణ' భారతదేశ భవిష్యత్తులో ఒక భాగమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story