TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

TSPSC: రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై

Jyothi
Published on: 10 Jan 2024 1:55 PM IST
Governor Approves Resignation of TSPSC Chairman
X

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

TSPSC: టీఎస్‌పీఎస్సీ ‍ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయి. రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. TSPSC ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి, ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది.

గతంలో జరిగిన పేపర్ లీకేజీ.. ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి.... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు గవర్నర్. రాజీనామాలను ఆమోదించడానికి తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో.. వెంటనే స్పందించి రాజీనామాలను ఆమోదించారు గవర్నర్ తమిళిసై.

Jyothi

Jyothi

Next Story