త్వరలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుంది: అల్లం నారాయణ

Arun Chilukuri
Updated on: 17 Feb 2021 7:01 PM IST
త్వరలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుంది: అల్లం నారాయణ
X

త్వరలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుంది: అల్లం నారాయణ

జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లంనారాయణ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సోకిన జర్నలిస్టులకు తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం సాయం చేయలేదని ఆయన చెప్పారు. కరోనా బారినపడ్డ ఒక్కో జర్నలిస్టుకు 20 వేల చొప్పున ఇప్పటివరకు మూడున్నర కోట్ల రూపాయల సాయం అందజేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ బర్త్ డే చేపట్టిన వృక్షార్చనలో భాగంగా వరంగల్ ప్రెస్ క్లబ్ లో అల్లంనారాయణ తదితరులు మొక్కలు నాటారు. ప్రభుత్వం ఇచ్చిన 34 కోట్ల రూపాయలతో మీడియా అకాడమీ జర్నలిస్టులను ఆదుకుంటుందని తెలిపారు. త్వరలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story