CS Rangarajan: చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి దాడిపై ప్రభుత్వం సీరియస్.. రంగరాజన్ కు సీఎం ఫోన్

CS Rangarajan: చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి దాడిపై ప్రభుత్వం సీరియస్.. రంగరాజన్ కు సీఎం ఫోన్
x
Highlights

CS Rangarajan: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరగడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రంగరాజన్ కు ఫోన్ చేసి...

CS Rangarajan: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరగడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వీరరాఘవరెడ్డితో పాటు మరో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు ఉన్నట్లుగా మొయినాబాద్ పోలీసులు తెలిపారు. మిగిలినవాళ్లను కూడా అతి త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

కాగా ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అర్చకుడిపై ఆగంతకులు దాడి చేసిన విషయం ఆలస్యంగా బయటకు రావడంతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగరాజన్ కు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిచేసిన వాళ్లను వెంటనే పట్టుకోవాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికూడా తీవ్రంగా ఖండించారు. పదవులు త్యాగించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పవిత్రమైన అర్చకుడిగా ఉన్న రంగరాజన్ పై దాడి హేయమైన చర్యగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి భౌతికదాడులు, బెదిరింపులకు తావులేదన్నారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని సనాతన ధర్మంపై జరిగిన దాడిగా చూడాలని బాధ్యులను విడిచిపెట్టుకుండా ప్రభుత్వం తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories