Telangana: దామెర రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన రాకేష్

Jyothi
Published on: 25 Jun 2022 7:13 AM IST
Government Job for Brother OF Damera Rakesh
X

Telangana: దామెర రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల ఘటనలో మరణించిన దామెర రాకేష్ సోదరుడు రామ్ రాజుకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాకేష్ కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు రామ్ రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకతకు దారి తీశాయి. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లతో పోలీసులు జరిపిన కాల్పుల ఘటనలో రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు.

Jyothi

Jyothi

Next Story