రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి : గవర్నర్ తమిళిసై


మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకరాజు రంగరాజు కళాశాల నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు.
మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకరాజు రంగరాజు కళాశాల నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు.అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనప్పుడు రక్తం అవసరం చాలా ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కొద్ది మంది భయపడకుండా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వహకులకు గవర్నర్ అభినందనలు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



