ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు.. వెంకన్నకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు..

Goreti Venkanna: ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2021 వరించింది.

Arun Chilukuri
Published on: 30 Dec 2021 4:27 PM IST
Goreti Venkanna Bags Kendra Sahitya Akademi Award 2021
X

ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు.. వెంకన్నకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు..

Goreti Venkanna: ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2021 వరించింది. "వల్లంకి తాళం" అనే కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా గోరెటి వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం కేసీఆర్. ప్రజా సమస్యలను, సామాజిక తాత్వికతతో కళ్లకు కడుతూ.. వెంకన్న అందించిన సాహిత్యం.. ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని అన్నారు కేసీఆర్.

మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరెటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని కేసీఆర్‌ కొనియాడారు. గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవమని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story