Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆడిటర్‌ బుచ్చిబాబు అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో అరెస్ట్

Dhatripriya
Updated on: 8 Feb 2023 10:05 AM IST
Gorantla Buchibabu Arrested In Delhi Liquor Scam
X

 Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆడిటర్‌ బుచ్చిబాబు అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందనే కారణంతో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. గతంలో ఎమ్మెల్సీ కవిత దగ్గర ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా బుచ్చిబాబు పనిచేశారు. ఇక ఇవాళ రౌస్‌ అవెన్యూ స్పెషల్‌ కోర్టులో బుచ్చిబాబును హాజరుపర్చనున్నారు. బుచ్చిబాబును విచారించడం ద్వారా మరింత సమాచారం రాబట్టొచ్చన్న ఉద్దేశంతో ఆయనను కస్టడీకి కోరనున్నారు సీబీఐ అధికారులు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో నవంబర్‌ 25న ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది సీబీఐ. ఈ ఛార్జ్‌షీట్‌లో ఏడుగురిపై అభియోగం మోపింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. తాజాగా మరో అరెస్ట్‌ చోటుచేసుకున్న నేపథ్యంలో లిక్కర్‌ స్కామ్‌లో మరిన్ని అరెస్టులు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది

Dhatripriya

Dhatripriya

Next Story