Peddapalli: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Train Derailed: పెద్దపెల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Nov 2024 9:09 AM IST
Goods Train Derailed in Peddapalli District
X

Peddapalli: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Train Derailed: పెద్దపెల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్‌ నుంచి పలాసకు ఐరన్‌తో వెళ్తున్నగూడ్స్ రైలు పాలకుర్తి మండలం కన్నాల సమీపంలోని రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలు తప్పడంతో 12 బోగీలు ట్రాక్‌పై కుప్పకూలాయి. గూడ్స్ బోగీలు మూడు ట్రాక్‌‌లపై చెల్లాచెదరుగా పడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

ఉత్తర-దక్షిణ భారతదేశాలకు కీలకమైన మార్గం(కాజీపేట-బల్లార్షా) కావడంతో రైళ్లను అధికారులు ఆయా స్టేషన్‌లలో నిలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం తెల్లవారుజాము వరకు పట్టాలను బాగు చేసే దిశగా రైల్వే అధికారులు సహాయక చర్యలు వేగిరం చేశారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రైల్వే జీఎంతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలన్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story