Hyderabad: హైద్రాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినవారికి గుడ్ న్యూస్..నాలుగేళ్లలో పెట్టుబడి రెట్టింపు

Hyderabad Real Estate
x

Hyderabad: హైద్రాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినవారికి గుడ్ న్యూస్..నాలుగేళ్లలో పెట్టుబడి రెట్టింపు

Highlights

Hyderabad Real Estate: భూమిని నమ్ముకుంటే తల్లిని నమ్ముకున్నట్టే.. ఈ రెండు అన్యాయం చేయవని పెద్దలు అంటుంటారు. నిజమే భూమిని నమ్మి ఉంటే ఎప్పటికైనా అది లాభాలను తెచ్చిపెడుతుంది.

Hyderabad Real Estate: భూమిని నమ్ముకుంటే తల్లిని నమ్ముకున్నట్టే.. ఈ రెండు అన్యాయం చేయవని పెద్దలు అంటుంటారు. నిజమే భూమిని నమ్మి ఉంటే ఎప్పటికైనా అది లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే కొన్నాళ్లుగా పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి రేట్లు అంతకంతకు పెరుగుతు వెళ్తున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చూస్తే అంటే నాలుగేళ్లలో మెట్రో నగరాలు అన్నింటికంటే ఒక్క హైదరాబాద్‌ మాత్రమే 80 శాతం రాబడిని తెచ్చి టాప్ లో నిలిచింది.

సాదారణంగా దేశంలో ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్ధక్ అహుజా మాత్రం దిమ్మతిరిగే వివరాలను బయటపెట్టారు. దేశంలో ఆ నగరాలన్నీ కూడా హైదరాబాద్ తర్వాతేనని తేల్చి చెప్పారు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే త్వరగా భూమి రేట్లు పెరుగుతున్నాయన్నారు.

భవిష్యత్తులో కూడా హైదరాబాద్‌లో భూమి రేట్టు రెట్టింపు స్థాయిలో పెరగనున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కచ్చితంగా హైదారాబాద్‌లో పెట్టుబడులు పెట్టొచ్చని, ఒక ఐదేళ్ల తర్వాత ఆ పెట్టుబడులు రెట్టింపు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక చిన్న భూమి కొందామన్నా రేట్లు ఆకాశాన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్తతో రేట్లు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories