Schools Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు

School Holidays
x

Schools Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు 

Highlights

Good news for students Holiday for schools and colleges todaySchools Holiday: విద్యార్థులకు శుభవార్త. నేడు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది...

Good news for students Holiday for schools and colleges today

Schools Holiday: విద్యార్థులకు శుభవార్త. నేడు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులు పాఠశాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

మరోవైపు ఏపీలో అవసరమైన పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుంది. కాబట్టి ఆయా జిల్లాల విద్యార్థులకు సోమవారం ఎంజాయ్ చేయవచ్చని చెప్పవచ్చు.

మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి మొదలవుతాయి. తర్వాత పదవతరగతి పరీక్షలు ఉంటాయి. ఆ వెంటనే డిగ్రీ పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా విద్యార్థులకు మరోసారి సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాంకులకు మార్చిలో ఏకంగా 14 రోజులు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ నెలలో పెద్దగా పండగలు ఏం లేకపోయినా ఇటు విద్యార్థులకు , అటు ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories