ECIL Recruitment 2022: ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. హైదరాబాద్‌ ECILలో ఉద్యోగాలు..!

ECIL Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఐటీఐ విద్యార్థులకి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

Shireesha
Published on: 6 April 2022 8:47 AM IST
Good News for ITI students ECIL Recruitment 2022 for 1625 Junior Technician posts | Live News
X

ECIL Recruitment 2022: ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. హైదరాబాద్‌ ECILలో ఉద్యోగాలు..! 

ECIL Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఐటీఐ విద్యార్థులకి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ అవకాశాన్ని తెలంగాణ ఐటీఐ విద్యార్థులు గమనించాలి. నోటిఫికేషన్‌కి సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయి.. జీత భత్యం, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.

మొత్తం ఖాళీల సంఖ్య 1625 ఉన్నాయి. ఇవి మొత్తం జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు మాత్రమే.

ట్రేడుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ 814 పోస్టులు, ఎలక్ట్రీషియన్‌ 184 పోస్టులు, ఫిట్టర్‌ 627 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మెకానిక్‌/ఎలక్ట్రీషియన్‌/ఫిట్టర్‌ ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి.

అలాగే అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

ఎంపికైన అభ్యర్థులకి మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780లు జీతంగా చెల్లిస్తారు. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఒక్కసారి నోటిఫికేషన్ చదవండి.

Shireesha

Shireesha

Next Story