PJR Flyover: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

PJR Flyover
x

PJR Flyover: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

PJR Flyover: హైదరాబాద్ నగరానికి మరో ట్రాఫిక్ ఉపశమనం లభించింది. ఐటీ కారిడార్‌లోని ముఖ్యమైన రహదారి విభాగంలో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభమైంది. కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) దాకా విస్తరించిన ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ప్రజల వినియోగానికి సిద్ధంగా ఉంది.

1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లుగా నిర్మితమైన ఈ ఫ్లైఓవర్‌ ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దబడింది. గచ్చిబౌలి జంక్షన్‌లో రోజూ ఎదురయ్యే ట్రాఫిక్ దొబ్బకు ఇది శాశ్వత పరిష్కారం కానుంది. ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ వరకు ప్రయాణించే వాహనదారులకు గణనీయంగా ప్రయాణ సమయం తగ్గనుంది.

ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక వ్యాపార, ఐటీ కేంద్రాలకు రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఇక నేరుగా ఓఆర్‌ఆర్‌ చేరుకోగలిగేలా మారింది. దీంతో ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు, స్థానికులు పెద్దఎత్తున లాభపడనున్నారు.

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి దిశగా ఇది మరో మెట్టు అనే అభిప్రాయం కార్యక్రమంలో పలువురు వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories