TS Mega DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ ప్రకటన

TS Mega DSC: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ సమయం దగ్గర పడుతుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఫైనల్ షెడ్యూల్ పై ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది.

Dhivi
Published on: 2 July 2024 6:04 AM IST
Tet in December and another DSC in February..Good news from Revanth Sarkar
X

TG DSC: డిసెంబర్ లో టెట్, ఫిబ్రవరిలో మరో డీఎస్సీ..రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

TS Mega DSC: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11.062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ ఎస్ ఏ 2629, భాష పండితులు 727, పీఈటీలు 182, ఎస్టీటీలు 6,508తోపాటు ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 22, ఎస్టీటీలు 796, పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

దీని తర్వాత టెట్ కూడా నిర్వహించి ఫలితాలను విడుదల చేశారు. దీంతో టెట్ లో క్వాలిఫై అయిన వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసి ప్రిపేర్ అవుతున్నారు. మెడా డీఎస్సీ పేరుతో ప్రకటించిన ఈ పరీక్షను జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ వ్రాత పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన పరీక్షల షెడ్యూల్ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ అధికారికంగా పరీక్ష తేదీలను ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

డీఎస్సీ వ్రాత పరీక్షలు వాయిదా పడబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్రాత పరీక్షలపై కీలక అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మరో రెండు , లేదా మూడు రోజుల్లో పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.

Dhivi

Dhivi

Next Story