Alampur: స్టేజిపైనే తన్నుకున్న TRS కార్యకర్తలు.. గిడ్డంగుల శాఖ చైర్మన్‌ సాయిచంద్‌పై దాడి

Alampur: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ టీఆర్‌ఎస్‌ వజ్రోత్సవాలో గొడవ జరిగింది.

Arun Chilukuri
Published on: 16 Sept 2022 3:28 PM IST
Godowns Dept Corporation Chairman Sai Chand Attacked
X

Alampur: స్టేజిపైనే తన్నుకున్న TRS కార్యకర్తలు.. గిడ్డంగుల శాఖ చైర్మన్‌ సాయిచంద్‌పై దాడి

Alampur: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ టీఆర్‌ఎస్‌ వజ్రోత్సవాలో గొడవ జరిగింది. అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రసంగించి స్టేజీ దిగుతున్న గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌పై కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ కుమార్ దాడి చేయించాడని సాయిచంద్ ఆరోపించారు. అలంపూర్ నియోకజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సాయిచంద్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతనిపై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story