నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్షణం ‌క్షణం పెరుగుతున్నా వరద ప్రవాహం

నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం వరద ప్రవాహం పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 25 Sept 2025 2:36 PM IST
నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్షణం ‌క్షణం పెరుగుతున్నా వరద ప్రవాహం
X

నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాలలో వేలాది ఎకరాలు, పుష్కర ఘాట్లు, నిత్యహరతి శివలింగాలు నీట మునిగాయి. ఒక ఘాట్ వద్ద మాత్రమే భక్తుల‌ పుణ్యస్నానాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. గోదావరి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story