Pocharam Firing Case: పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల ఘటన.. ముగ్గురి అరెస్ట్‌

Pocharam Firing Case: పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల ఘటన.. ముగ్గురి అరెస్ట్‌
x

Pocharam Firing Case: పోచారం ఐటీ కారిడార్‌లో కాల్పుల ఘటన.. ముగ్గురి అరెస్ట్‌

Highlights

Pocharam Firing Case: మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్‌పై కాల్పులు జరపగా.. యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pocharam Firing Case: మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్‌పై కాల్పులు జరపగా.. యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్ల గో అక్రమ రవాణాను అడ్డుకున్నారు ప్రశాంత్. గోవులను అక్రమంగా తరలిస్తున్న ఇబ్రహీం.. తరచూ ప్రశాంత్‌ అలియాస్‌ సోనూతో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో.. శ్రీనివాస్ అనే వ్యక్తితో సోనూను ట్రాప్ చేశాడు ఇబ్రహీం.. గోవులను తరలిస్తున్నారని శ్రీనివాస్‌తో.. సోనూకు ఫోన్ చేయించి... యమ్నంపేటలోని నిర్మానుష్య ప్రదేశానికి రావాలని ఇబ్రహీం కుట్ర పన్నాడు. కుట్రలో ఇరుకున్న సోను అలియాస్ ప్రశాంత్‌‌తో ఇబ్రహీం గొడవ పడ్డారు. మాట మాట పెరగటంతో.. ఇబ్రహీం ప్రశాంత్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం పారిపోయి.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.

యశోదలో చికిత్స పొందుతున్న ప్రశాంత్‌ను పరామర్శించేందుకు భారీ ఎత్తున గో రక్షక్ దళ సభ్యులు ఆస్పత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో.. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. యశోద ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించి.. ఆస్పతికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనికీలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories