Global Hospital: ఇంకా పరారీలోనే గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్

Global Hospital: గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్ ఇంకా పరారీలో ఉన్నారు.

Arun Chilukuri
Updated on: 6 Jun 2021 7:15 AM IST
Global Hospital CMD Ravindranath is Still on the Run
X

Global Hospital: ఇంకా పరారీలోనే గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్

Global Hospital: గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈనెల 2న భర్త రవీంద్రనాథ్ తనపై దాడి చేసి హత్య చేయబోయడని భార్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కంప్లైట్ ఇచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా రవీంద్రనాథ్‌ను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. పైస్థాయిలో ఒత్తిళ్లే అందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు తీవ్ర గాయాలతో రవీంద్రనాథ్ భార్య ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

ఒకవైపు మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తుంటే మరోవైపు బాధితురాలు ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవీంద్రనాథ్‌ను అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story