నారీ నారీ నడుమ మురారి.. ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల..

Girls Fight Over Common Boyfriend in Khammam
x

నారీ నారీ నడుమ మురారి.. ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల..

Highlights

Khammam: ఓ యువకుడు ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను ప్రేమించగా...

Khammam: ఓ యువకుడు ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను ప్రేమించగా తననే పెళ్లి చేసుకోవాలంటూ ఆ ఇద్దరు యువతులు ఘర్షణకు దిగిన సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో చోటు చేసుకుంది. పాతర్లపాడు గ్రామానికి చెందిన మాచర్ల రోహిత్ అదే గ్రామానికి చెందిన వరుసకు సోదరి అయ్యే యువతిని ప్రేమించాడు. అంతటితో ఆగకుండా ఇంటర్మీడియట్‌లో తనకు పరిచయమైన తల్లాడ మండలానికి చెందిన మరో యువతిని సైతం ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించాడు. విషయం తెలుసుకున్న ఇద్దరు ప్రియురాళ్లు గ్రామానికి వచ్చి ఘర్షణకు దిగారు. తననే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి యువతులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. విషయం పీఎస్‌కు చేరడంతో ముగ్గురికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories