పెళ్లి అడ్డుకునేందుకు ప్రియురాలు యత్నం.. వరుడి బంధువుల దాడి

Khammam: ఖమ్మంలో ప్రియురాలిపై ప్రియుడి బంధువుల దాడికి పాల్పడ్డారు.

Arun Chilukuri
Published on: 15 April 2022 4:57 PM IST
Girl Tries to Stop Boyfriends Wedding, Beaten up by Relatives in Khammam
X

పెళ్లి అడ్డుకునేందుకు ప్రియురాలు యత్నం.. వరుడి బంధువుల దాడి

Khammam: ఖమ్మంలో ప్రియురాలిపై ప్రియుడి బంధువుల దాడికి పాల్పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్‌ తనను ఎనిమిదేళ్లుగా ప్రేమించాడని అదే ప్రాంతానికి చెందిన రజినీ అనే యువతి ఆరోపించింది. శ్రీనాథ్‌ తనను మోసం చేసి ఇప్పుడు రహస్యంగా ఖమ్మం వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడని పేర్కొంది. ప్రియుడి పెళ్లి అడ్డుకునేందుకు కల్యాణమండపానికి వచ్చిన యువతిపై వరుడి బంధువుల దాడి చేశారు. తనను ప్రేమించి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియురాలు ఆరోపిస్తోంది. పెళ్లి మండపం నుంచి ప్రియురాలిని ఈడ్చుకెళ్లారు వరుడి బంధువులు. అయితే అక్కడే వున్న కానిస్టేబుల్ కనీసం ప్రయత్నం చేయలేదని రజినీ ఆవేదన వ్యక్తం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story