కులాంతర వివాహం.. అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టిన అమ్మాయి బంధువులు..

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 3 Jan 2023 5:04 PM IST
Girl Relatives Burned Boy House in Huzurabad
X

కులాంతర వివాహం.. అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టిన అమ్మాయి బంధువులు..

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నారని ఆగ్రహంతో బంధువులు అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టారు. హుజురాబాద్‌కు చెందిన రాజశేఖర్, సంజన కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం వేములవాడలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జంట పోలీసులను ఆశ్రయించింది. కులాంతర వివాహం చేసుకోవడం అమ్మాయి కుటుంబీకులకు ఇష్టంలేదు. వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న రాజశేఖర్ ఇంటికి ఆమె బంధువులు నిప్పుపెట్టారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story