GHMC: ముగిసిన GHMC పాలకమండలి గడువు: నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలన.. రేపే విభజన ఉత్తర్వులు!

GHMC Term Ends Today: భాగ్యనగర పాలనలో భారీ మార్పులకు తెరలేచింది.

Arun Chilukuri
Updated on: 10 Feb 2026 1:01 PM IST
GHMC: ముగిసిన GHMC పాలకమండలి గడువు: నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలన.. రేపే విభజన ఉత్తర్వులు!
X

GHMC Term Ends Today: భాగ్యనగర పాలనలో భారీ మార్పులకు తెరలేచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రస్తుత పాలక మండలి గడువు నేటితో (మంగళవారం) ముగియనుంది. దీంతో నేటి సాయంత్రం నుంచే జీహెచ్‌ఎంసీ పగ్గాలను ప్రత్యేక అధికారి (Special Officer) చేపట్టనున్నారు.

హైదరాబాద్ నగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్‌లుగా విభజించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది. దీనికి సంబంధించి రేపు (బుధవారం) అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. విభజన తర్వాత ఏర్పడే మూడు కార్పొరేషన్‌లు ఇవే:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)

గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్

గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

మే నెలలో ఎన్నికల నగారా..

కొత్తగా ఏర్పడనున్న మూడు కార్పొరేషన్‌లకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చింది. మే 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, జూన్ మొదటి వారంలో నూతన పాలకవర్గాలు కొలువుదీరే అవకాశం ఉంది. నగర విస్తీర్ణం పెరగడం, జనాభా ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విభజన ప్రక్రియను చేపడుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story