Hyderabad: 300 డివిజన్లు.. 3 కార్పొరేషన్లు: భాగ్యనగర పాలనలో కొత్త అధ్యాయం!

GHMC Split into Three: జీహెచ్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 11 Feb 2026 11:15 AM IST
Hyderabad: 300 డివిజన్లు.. 3 కార్పొరేషన్లు: భాగ్యనగర పాలనలో కొత్త అధ్యాయం!
X

Hyderabad: 300 డివిజన్లు.. 3 కార్పొరేషన్లు: భాగ్యనగర పాలనలో కొత్త అధ్యాయం!

GHMC Split into Three: జీహెచ్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్‌ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పాత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్‌తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో మూడు కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్‌-3(1) ప్రకారం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story