Hyderabad: మోతీనగర్ లో ఉద్రిక్తత.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదన్న జీహెచ్ఎంసీ

Hyderabad: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన టీడీపీ

Dhatripriya
Published on: 14 May 2023 12:46 PM IST
GHMC Says No Permission To Set Up NTR Statue
X

Hyderabad: మోతీనగర్ లో ఉద్రిక్తత.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదన్న జీహెచ్ఎంసీ

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మోతీ‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ దానిని తొలగించేందుకు జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు జీహెచ్ఎంసీ సిబ్బందికి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్రపూరితంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతులు మండిపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story