Hyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య

GHMC Sanitation Workers Facing Salary Problems | Hyderabad News
x

Hyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య

Highlights

Hyderabad: బయోమెట్రిక్ విధానంతో తమ హాజరు నమోదు చేసుకుంటున్న కార్మికులు

Hyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు జీతం కట్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులు పనిచేసినా చిన్న పొరపాటులో పూర్తి శాలరీ అందుకోలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం బయోమెట్రిక్ హాజరు విధానమే అంటున్నారు కార్మికులు. అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. కార్మికుల జీతాల సమస్యపై స్ఫెషల్ స్టోరి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు జోన్లు, వాటిలో ముప్ఫై సర్కిళ్లున్నాయి. దాదాపు 8వేల మంది కార్మికులున్నారు. వీరిలో మూడు వేల మంది వేతనాల్లో కోత విధించారు. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు 14వేల వేతనానికి 15వందల నుంచి 8వేల వరకు వేతనాల్లో కోత పడింది. దీంతో బల్దియా పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ జీతాలు రాకపోవడానికి ప్రధాన కారణం బయో మెట్రిక్ విధానమే అనే మాట వినిపిస్తుంది. బయోమెట్రిక్ మిషన్లలో సాంకేతిక లోపాలున్నా సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకపోయిన పాత మిషన్లనే కొనసాగించారు. పనిచేయని మిషన్లలో బయోమెట్రిక్ తీసుకుని సమయంలో తేడా వచ్చినా కోత విధించారు.

పారిశుధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6నుండి మధ్యాహ్నం 2గంటల వరకు వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం 5నుంచి 6గంటల లోపు బయో మెట్రిక్ నమోదు చేయాల్సి ఉండగా ఐదున్నర గంటలు దాటితే వేయక పోవడం వల్లే జరిగిందని మరికొందరు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ మిషన్లు సరిగ్గా వినియోగించడం రానందున కూడా గైర్హాజరు పడుతున్నట్టు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులే కాంట్రాక్టు ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories