GHMC: చిన్నారి మౌనిక కుటుంబానికి జీహెచ్‌ఎంసీ ఆర్థిక సాయం

GHMC: కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్‌ను అందించిన మేయర్‌ గద్వాల

Dhatripriya
Published on: 3 May 2023 3:22 PM IST
GHMC Provided Financial Assistance To Maunikas Family
X

GHMC: చిన్నారి మౌనిక కుటుంబానికి జీహెచ్‌ఎంసీ ఆర్థిక సాయం

GHMC: హైదరాబాద్‌ క‌ళాసిగూడలో నాలా గుంతలో పడి చనిపోయిన చిన్నారి మౌనిక కుటుంబానికి GHMC తరఫున మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆర్థికసాయం అందించారు. 2 లక్షల రూపాయల చెక్‌ను మౌనిక కుటుంబానికి అందించారు. అనంతరం మౌనిక తల్లిదండ్రులను ఆమె ఓదార్చారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు గద్వాల. అటు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనిక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. మంత్రి తలసాని మౌనిక కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు తలసాని. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నాలా గుంతలో పడి మౌనిక మృతి చెందిన ఘటన.. అందరినీ కలచివేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story