కాసేపట్లో జీహెచ్‌ఎంసీ కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం

Sandeep Eggoju
Published on: 11 Feb 2021 10:57 AM IST
GHMC New Carporaters Oath will soon
X

Representational Image

కాసేపట్లో జీహెచ్‌ఎంసీ కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన 149 మంది కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిల్ హాల్ లో ప్రమాణస్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలుగు,ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రమాణ స్వీకార పత్రాలుంటాయని.. అందులో ఏ భాషనైనా ఎంచుకొని కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయొచ్చని తెలిపారు.

ఇక ప్రమాణస్వీకారం అయిపోయిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల పరిశీలకులుగా సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వ్యవహరించున్నారు. చేతులెత్తే విధానం ద్వారా ఓటింగ్ జరగనుండగా ఈ ఎన్నిక ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి నిర్వహిస్తారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story