ఫిబ్రవరి 11న కార్పొరేటర్ల ప్రమాణం..ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా?

ఫిబ్రవరి 11న కార్పొరేటర్ల ప్రమాణం..ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా?
x
Highlights

*ప్రమాణ స్వీకారం చేసేందుకు కార్పొరేటర్ల తర్జనభర్జన *మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా? మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగవా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బల్దియా పాలక మండలి సమావేశం వీలౌతుందా? ఓ వైపు ఆమావాస్య... మరో వైపు బడ్జెట్ సమావేశాలతో.. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పోరేషన్‌కు గత డిసెంబర్ 1న ఎన్నికలు జరగ్గా.. 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. గెలిచిన వారంతా వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తామని ఆశించారు. కానీ వారి ఆశలపై ఎన్నికల కమిషన్ అధికారులు నీళ్లు చల్లారు. ఫిబ్రవరి 11వ తేదీన 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు గెలిచిన కార్పొరేటర్లు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ అంశం బల్దియా కమీషనర్ కు కోంత మంది కార్పోరేటర్లు కలిశారు.

ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారం 11వ తేది రోజే 12గంటల 30నిముషాలకు మేయర్ డిప్యూటి మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించాలి. అయితే ఆ రోజు ఈ కార్యక్రమం ఉంటుందా లేదా అనేది హాట్ టాఫిక్ అయ్యింది. ఆరోజు అమవాస్య కావడం ఒకటైతే..., ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరో అంశమైంది. సాదారణంగా అయితే రాష్ట్ర కేంద్ర చట్ట సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు లోకల్ బాడిలు తమ సమావేశాలు నిర్వహంచవు. ఎందుకంటే ఎమ్మెల్యేలు.., ఎమ్మేల్సీలు... ఎంపీలు లోకల్ బాడిల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇక ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పాలకమండలి మేయర్ డిప్యూటి మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. దాంతో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపిలు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దాంతో బల్దియా మొదటి సమావేశం ఉంటుందా లేదా అనేది బల్దియాలో చర్చనీయ అంశం అయ్యింది.

అమావాస్య నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు సభ్యులు పూర్తి స్థాయిలో రాకుంటే మాత్రమే తరువాతి రోజు సమావేశం ఉంటుంది. ఓ వైపు అమావాస్య, మరోవైపు పార్లమెంట్ సమావేశాలు...ఈ నేపద్యంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేదా...వేచి చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories