బల్దియా ఎన్నికలకు వడివడిగా అడుగులు

బల్దియా ఎన్నికలకు వడివడిగా అడుగులు
x
Highlights

బల్దియా ఎన్నికలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు , అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఈ నేపథ్యంలో...

బల్దియా ఎన్నికలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు , అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పంపిన జాబితాను ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. అయితే చాలా మున్సిపాలిటిలలో పాలక మండలి గడువు ముగిసి ఏళ్లు గడిచినా ఎన్నికలు పెట్టరు. కాని గ్రేటర్ హైదరాబాద్ లో నాలుగు నెలల గడువు ఉన్నా ఎందుకు హడావుడి చేస్తున్నారు?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో మళ్లీ కదలిక మొదలైంది. నవంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ విడుదల చేసి డిసెంబర్‌ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో జోనల్, సర్కిల్‌ కార్యాలయాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. ఆ తరువాత ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అభివృద్ధి పనులపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీ రూల్ ప్ర‌కారం కార్పోరేటర్ల గడువు ముగిసిన మూడు నెల‌ల్లోగా ఎన్నికలు జ‌ర‌గాలి. అందుకే ప్రభుత్వం ముందే ప్రిపేర్ అవుతోంది. అయితే గతంలో జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ముగిసిన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఎన్నికలు జరిగేవి కావు. కాని ఇప్పుడు హైదరాబాద్ లో గడువు కూడా ముగియక ముందే ఎన్నికల నిర్వహణ కు సిద్దం చేస్తున్నారు. త్వరలో ఓటర్ల లిస్ట్ కూడా రానుంది. 2020 జ‌న‌వ‌రి 1 ని బేస్ చేసుకుని ఓట‌ర్ల లిస్ట్ త‌యారు చేయ‌నున్నారు. అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల‌ను బేస్ చేసుకుని వార్డుల వారీగా లిస్ట్ రెడీ కానుంది. హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వరదలతో నష్టపోయిన వారికి సహాయం అందలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories