కాసేపట్లో హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కాసేపట్లో హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
x
Highlights

* తుది అంకానికి గ్రేటర్ ఎన్నికల ప్రచారం * చివరిరోజు ప్రచారానికి సన్నద్ధమవుతోన్న పార్టీలు * భాగ్యలక్ష్మి ఆలయంలో దర్శనం తర్వాత రోడ్‌షో

గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇక తామేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్‌ నేతలు టీఆర్ఎస్‌, బీజేపీ నేతలపై మాటల యుద్ధం చేస్తున్నారు.

గ్రేటర్‌లో ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ తమ మార్క్‌ రాజకీయంతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే నగరంలో రాష్ట్ర బీజేపీ అధ‌్యక్షులు బండి సంజయ్‌, ఫైర్ బ్రాండ్‌ అర్వింద్‌ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ టీఆర్ఎస్‌ పార్టీ, ఎంఐఎంను టార్గెట్‌ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచారపర్వం ముగియనుండటంతో బీజేపీ ప్రచార దూకుడును మరింత పెంచింది. ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాసేపట్లో నగరానికి చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ఆయన నేరుగా చార్మినార్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత వారాసిగూడలో రోడ్‌ షోలో పాల్గొంటారు. ఇక షా పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు ఓల్డ్‌ సిటీలో భారీగా మోహరించాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories