చైతన్యపురి డివిజన్‌లో ఉద్రిక్తత: బీజేపీ, టీఆర్ఎస్‌ కార్యకర్తల బాహాబాహీ

Arun Chilukuri
Published on: 30 Nov 2020 7:19 PM IST
చైతన్యపురి డివిజన్‌లో ఉద్రిక్తత: బీజేపీ, టీఆర్ఎస్‌ కార్యకర్తల బాహాబాహీ
X

హైదరాబాద్‌ ఛైతన్యపురి డివిజన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. టీఆర్ఎస్‌ శ్రేణులు మధ్యం పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. కావాలనే తమపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహించిన టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఛైతన్యపురిలో బీజేపీ కార్యాలయం ముట్టడికి బయల్దేరారు. దీంతో వారిని నివారించే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ కార్యాలయంలో ఉన్న తమపై అకారణంగా పోలీసులు దాడి చేశారంటూ చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story