క్లైమాక్స్ లో బీజేపీలో టిక్కెట్ల లొల్లి

Arun Chilukuri
Published on: 20 Nov 2020 3:08 PM IST
క్లైమాక్స్ లో బీజేపీలో టిక్కెట్ల లొల్లి
X

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే 21 డివిజన్లకు ఇంకా అభ్యర్ధులు ఖరారు కాలేదు. ప్రకటించని డివిజన్లపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. అయినా నామినేషన్లు వేసుకోవాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కు ఆరు సీట్లపై పార్టీ హామీ ఇవ్వడంతో అక్కడి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధులను ప్రకటిస్తే అడ్డుకుంటామని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు గోషామహల్ నియోజకవర్గ పరిధిలోనూ తన అనుచరులకు టికెట్లు కేటాయించనట్లయితే రాజీనామా చేస్తానంటూ ఎమ్మల్యే రాజాసింగ్ హెచ్చరించారు. అధిష్టానం అభ్యర్ధులను ప్రకటించలేదు. రాజీనామా చేస్తానంటూ వచ్చిన ప్రచారాన్ని రాజాసింగ్ ఖండించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story