GHMC elections 2020: గ్రేటర్ పరిధిలో కేటీఆర్ ఈరోజు ప్రచారం ఇలా..

GHMC elections 2020: మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలో పలు చోట్ల ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు

admin
Published on: 22 Nov 2020 11:06 AM IST
Minister KTR Campaign in GHMC elections 2020
X

GHMC Elections 2020 KTR campaign

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూకుడు పెంచింది. గత బల్దియా ఎన్నికల్లో అన్నీతానై పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన మంత్రి కేటీఆర్‌ మరోసారి ప్రచార బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలుత సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని జహీరానగర్‌ చౌరస్తా, 5 గంటలకు ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తా, 6.30 గంటలకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ చౌరస్తా, 7.30 గంటలకు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు చౌరస్తాల్లో రోడ్‌ షోలో ప్రసంగించనున్నారు.

ఇక నగరంలోని అన్ని డివిజన్లలో మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతో ఆయన పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా రోజుకు నాలుగు నుంచి ఆరు చోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో ఉండేలా ఏర్పాట్లు చేసింది. అలాగే పలు డివిజన్లలో రాష్ట్ర మంత్రులు అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహిస్తున్నారు.


admin

admin

Next Story