రేపు హైదరాబాద్‌కు హోం మంత్రి అమిత్‌షా

Arun Chilukuri
Published on: 28 Nov 2020 5:43 PM IST
రేపు హైదరాబాద్‌కు హోం మంత్రి అమిత్‌షా
X

గ్రేటర్ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. బల్దియా ప్రచారంలో కమలం నేతలు దూకుడు పెంచారు. గ్రేటర్‌లో ప్రచారానికి కమలం అగ్రనేతలు వస్తున్నారు. హైదరాబాద్‌లో నేడు యూపీ సీఎం.. రేపు అమిత్‌ షా క్యాంపెయిన్‌ నిర్వహించనున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్రం హోం మంత్రి అమిత్‌షా హైదారాబాద్‌కు రానున్నారు. రేపు ఉదయం 10గంటలకు బేగంపేటకు హోంమంత్రి చేరుకోనున్నారు. బేగంపేట నుంచి నేరుగా చార్మినార్‌కు వెళ్లనున్నారు. అమిత్‌షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story