GHMC ఎన్నికల షెడ్యుల్ : డిసెంబర్ 01 న పోలింగ్ .. 04 న కౌంటింగ్ !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న GHMC ఎన్నికల షెడ్యుల్ రానే వచ్చింది. డిసెంబర్ 01 న పోలింగ్ జరగనుండగా, 04 న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట డిసెంబర్ 03 న రీపోలింగ్ నిర్వహించనున్నారు.

Krishna
Updated on: 17 Nov 2020 11:12 AM IST
GHMC ఎన్నికల షెడ్యుల్ : డిసెంబర్ 01 న పోలింగ్ .. 04 న కౌంటింగ్ !
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న GHMC ఎన్నికల షెడ్యుల్ రానే వచ్చింది. డిసెంబర్ 01 న పోలింగ్ జరగనుండగా, 04 న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట డిసెంబర్ 03 న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం ఏడూ గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషినర్ పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నట్టుగా పార్థసారథి వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని అయన వెల్లడించారు. అన్నీ రాజకీయ పార్టీలతో చర్చించి ఓటర్ల జాబితా పైన తుది నిర్ణయం తీసుకున్నామన్న పార్థసారథి, 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే GHMC ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20 న నామినేషన్ల స్వీకరణకి చివరి తేది అని పార్థసారథి తెలిపారు.

Krishna

Krishna

Next Story