గ్రేటర్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గ్రేటర్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
x
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొద్దిసేపటి క్రితం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజున వివిధ పార్టీల నేతలు,...

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొద్దిసేపటి క్రితం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజున వివిధ పార్టీల నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి.

కాగా, నిన్న రెండో రోజు దాదాపు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అప్పటివరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. గురువారం దాఖలు చేసిన నామినేషన్‌లలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 195 దాఖలు అయ్యాయి. ఆ తర్వాత బీజేపీ నుంచి 140 మంది, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, టీడీపీ 47, వైసీపీ 1, సీపీఐ నుంచి ఒకరు, సీపీఎం 4 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 15, స్వతంత్ర అభ్యర్థులు 110 నామినేషన్లు దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories