కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. తొలిసారి ప్రత్యక్షంగా భేటీ...

GHMC Council: *మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం *వ్యూహ, ప్రతివ్యూహాలతో టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధం

Shireesha
Updated on: 18 Dec 2021 11:41 AM IST
GHMC Council Meeting Today Under Guidance of Mayor Gadwal Vijayalakshmi at Baldia Office | Live News
X

కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. తొలిసారి ప్రత్యక్షంగా భేటీ...

GHMC Council Meeting: ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ప్రస్తుత పాలకమండలి తొలిసారి ప్రత్యక్షంగా భేటీ అవుతోంది. కౌన్సిల్ మీటింగ్ కోసం బల్దియా ఆఫీస్‌లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగనుంది. కరోనా కారణంగా గతంలో వర్చువల్‌గా కౌన్సిల్ భేటీ జరిగింది. కరోనా కారణంగా సమావేశం ఆలస్యమైంది. కౌన్సిల్ సమావేశంలో వ్యూహ, ప్రతివ్యూహాలతో టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.

ప్రశ్నోత్తరాల్లో 23 ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసమస్యలపై టీఆర్ఎస్‌ను నిలదీస్తామని బీజేపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. గ్రేటర్ అభివృద్ధిని కౌన్సిల్ భేటీలో చెప్తామమని టీఆర్ఎస్ పేర్కొంది. సమావేశంలో కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులుగా నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. మరోవైపు గ్రేటర్ కౌన్సిల్ సమావేశానికి 200 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Shireesha

Shireesha

Next Story