‌ గ్యాంగ్ రేప్‌ కేసులో కొత్త విషయాలు

Arun Chilukuri
Updated on: 12 Feb 2021 8:14 PM IST
‌ గ్యాంగ్ రేప్‌ కేసులో కొత్త విషయాలు
X

representative image

ఘట్‌కేసర్‌ గ్యాంగ్ రేప్‌ కేసులో కొత్త విషయాలు బయటికి వచ్చాయి. నిందితులంతా 25-30ఏళ్లలోపు వాళ్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆటోడ్రైవర్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారంరోజులుగా రెక్కీ నిర్వహించాకే గ్యాంగ్ రేప్‌ ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాగారం సర్కిల్‌లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితులంతా ఎంఎన్‌పేట్, ఆర్‌ఎల్‌నగర్ వాసులుగా తేల్చారు. నిందితులపై కిడ్నాప్, రేప్‌, బెదిరింపులు, నిర్భయ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రస్తుతం భువనగిరి ఎస్వోటీలో నిందితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స జరుగుతోంది. యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story