హైదరాబాద్ మీర్‌చౌక్‌లో పేలిన గ్యాస్ సిలిండర్: 13 మందికి గాయాలు

X
హైదరాబాద్ మీరు చౌక్ లో గ్యాస్ సిలిండర్ పేలుడు (ప్రతీకాత్మక చిత్రం)
Highlights
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు - బాధితులంతా బెంగాల్‌కు చెందిన వారిగా గుర్తింపు
K V D Varma21 Jan 2021 4:04 AM GMT
Gas Cylinder Blast Today: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలిన ఘటనలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులంతా ఒకే ఇంట్లో ఉండటంతో.. అందరు గాయాలపాలయ్యారు. వీరంతా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ స్వర్ణకారులుగా పని చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గోల్డ్ వస్తువుల తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌చౌక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Web TitleGas Cylinder Blast in Hyderabad Meerchowk 13 People Injured
Next Story